ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే వరద
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే నంద్యాల వరదారాజుల రెడ్డి అన్నారు. "ఇది మంచి ప్రభుత్వం" 2వ రోజు కార్యక్రమం సోములవారిపల్లె పంచాయతీ పరిధిలోని ఈశ్వర్ రెడ్డి నగర్ నందు శనివారం ప్రారంభించగా ఎమ్మెల్యే వరద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత "ఇది మంచి ప్రభుత్వం" అని అనిపించుకుంటుందన్నారు. అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాదిమంది పేదల ఆకలి తీర్చే "అన్న క్యాంటీన్లు", యువత భవిష్యత్తుకు "మెగాడీఎస్సీ" ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సోములవారిపల్లె పంచాయతీని పూర్తిగా అభివృద్ధి చేస్తామని రోడ్లు కాలువలను నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ నాయకులు, ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments