అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.
చిట్వేలు పరిసర ప్రాంతాల లోని గ్రామాల నుంచి సేకరించిన 7500 కేజీల 150 బస్తాల రేషన్ బియ్యన్ని కడప విజిలెన్స్ సిఐ రెడ్డయ్య సిబ్బందితో కలిసి పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్సై సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్లో మంగళవారం పాత్రికేయులకు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.మండల పరిధిలోని చెర్లోపల్లి క్రాస్ వద్ద మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో 150 బస్తాల గల బియ్యంతో వెళుతున్న Ap39TU5898,Ap39TU5286, నెంబర్ గల రెండు వాహనాలను స్వాధీనపరుచుకున్నారన్నారు. రేషన్ బియ్యం రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన రమేష్, శీను, కరిముల్లా, ప్రసాద్ ,వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా పట్టుబడిన బియ్యాన్ని రెవిన్యూ అధికారులు చెర్లోపల్లిలోని రేషన్ షాప్ నందు భద్రపరిచి రసీదును తయారుచేసినట్లు ఆర్ఐ శేషం రాజు తెలిపారు.
నిద్ర వ్యవస్థలో చెక్పోస్టులు..
అటవీ సంపద, మద్యం, రేషన్ బియ్యం,ఇసుక, నగదు తదితర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల పనితీరు పలు విమర్శలకు దారి తీస్తోంది. మంగళవారం పట్టుబడ్డ రేషన్ బియ్యం స్థానిక రెండు చెక్పోస్టులు దాటుకుని రాపూరు సరిహద్దున విజిలెన్స్ అధికారులు మంగళవారం వేకుజమున పట్టుకున్నట్లు స్థానికులు పలువురు ఆరోపిస్తుండడం గమనహారం. దీన్నిబట్టి గమనిస్తే పోలీసు, అటవీ శాఖ చెక్పోస్టుల వద్ద ఉన్న అధికారులు మామూలు మత్తులో నిద్రపోతున్నారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తల ఒగ్గుతున్నారా? అన్న సందేహాలు సామాన్యునికి సైతం కలగక మానవు. ప్రతినిత్యం రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతున్నట్టు దీనంతటికీ ఓ పెద్ద వ్యవస్థ ఉన్నట్లు స్థానికుల గుసగుసలు వినపడుతున్నాయి. కాగా ఉన్నతాధికారులు నిఘా వ్యవస్థను చక్కదిద్దుతారా? లేక ఇలాగే కొనసాగిస్తారా? అన్నది ప్రశ్నార్థకం.
Comments