కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం ఇళ్ళూరు గ్రామంలో ఇసుక రవాణా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇల్లూరు గ్రామంలో పెన్నా నదిలో ఇసుక క్వారీ నీ జే.పి కంపెనీ ఇసుక రవాణా చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెన్నా నదిలో ఇసుక అడుగంటి పోతుందని త్రాగునీటికి గ్రామంలో ఇబ్బందులు ఎదురవుతాయని గ్రామస్తులు రవాణాను అడ్డుకున్నారు. అయినా జెపి కంపెనీ తమకు అనుమతులు ఉన్నాయంటూ అధికారుల సమక్షంలో ఇసుక రవాణా జరుపుతున్నారు. ఇసుక రవాణాను వెంటనే ఆపాలంటూ ఇల్లూరు గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 21 హైకోర్టు స్టే ఇచ్చిందనీ,అయినా గ్రామంలో జే.పీ కంపెనీ ఇసుక రవాణా చేస్తుందని ఈరోజు సాయంత్రం గ్రామస్తులు ఇసుక ట్రిప్పర్లను అడ్డుకోవడంతో అక్కడే ఉన్న జేపీ కంపెనీ సిబ్బంది గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామస్తులపై జే.పీ కంపెనీ సిబ్బంది దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. కల్లమల్ల ఎస్సై సంజీవరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను స్టేషన్ కు తరలించారు.
top of page
bottom of page
Comments