షర్మిలకు ఇండిపెండెంట్ పాస్టర్ అసోసియేషన్ మద్దతు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిలకే తమ మద్దతు అంటూ ప్రొద్దుటూరు క్రైస్తవ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ, దేశంలో పేరుకు మాత్రమే అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందని ఎన్డీఏ కూటమి మూడవసారి అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తుందని, మోడీ హయాంలో దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని అన్నారు. ఒక ప్రక్క చర్చిలపై దాడులు, మరోపక్క పాస్టర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, మణిపూర్ లాంటి సంఘటనలు సిగ్గుచేటని అన్నారు.
అనంతరం ఇండిపెండెంట్ పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు మల్లెం విజయభాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేతబట్టి ఈ ఎన్నికలలో కడప ఎంపీగా బరిలోకి దిగిన నేపథ్యంలో, క్రీస్తు ఆరాధన చేత షర్మిల ఆమె భర్త అనిల్ కుమార్ క్రైస్తవులకు చేసిన సేవలను గుర్తుచేస్తూ, ఈ ఎన్నికలలో తమ పూర్తి మద్దతు సహాయ సహకారాలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ షర్మిల కే నని స్పష్టం చేశారు. జగన్ సర్కార్ క్రైస్తవులను అన్యాయం చేసిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు లాజర్, కిషోర్, రాజేష్, డేవిడ్, ప్రభుదాస్, రాజ్, ఇమ్మానుయేల్, జాన్, పాల్, చంద్రపాల్, ప్రేమ్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
Comments