యువతను సన్మార్గంలో నడిపించడమే ఐవైయమ్ లక్ష్యం - ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర అధ్యక్షులు
ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాలకు లోనవుతున్న నేపథ్యంలో వారిని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయడమే ఐడియల్ యూత్ మూమెంట్ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు ఆదివారం స్థానిక పెన్నా నగర్ లో జైనాబ్ మసీదు ఆవరణలో ఐడియల్ యూత్ మూమెంట్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సు లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008 నుండి ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. 2014 ఏపీ విభజన అనంతరం ఏపీలో ప్రారంభించామన్నారు యువకుల్లో శక్తి సామర్థ్యాలు పెంచి సమాజంలోని యువతను సన్మార్గంలో నడిపించడంలో భాగస్వామ్యంలో చేయడం ముఖ్య ఉద్దేశం అన్నారు ముస్లిం యువకుల అభివృద్ధి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి వారిలో మంచిని పెంపొందించి సమాజంలో మంచిని స్థాపించడంలో భాగస్వామ్యం చేస్తూ ఐడియల్ యూత్ మూమెంట్ ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగా ఏపీలో జిల్లా సదస్సులు ఏర్పాటు చేసి ముస్లిం యువత భాగస్వామ్యంతో 2023 జనవరి 28 29 తేదీలలో ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.
జిల్లా సదస్సులలో యువతను మేల్కొల్పి మంచి సమాజాన్ని స్థాపించే దిశగా వారిని భాగస్వామ్యులను చేసి యువతను సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీముల్లా ఖాన్ మాట్లాడుతూ జిల్లా సదస్సులలో యువకులు తమ జీవిత లక్ష్యాన్ని మంచిని గుర్తు చేస్తూ ఇహ పరలోకంలో స్థానం పొందేందుకు కృషి చేసే దిశగా తీర్చిదిద్దుతామన్నారు ప్రొద్దుటూరు శాఖ పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో 2015 -16 నుండి ఐడియా యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు రైస్ బ్యాంకు ఏర్పాటు చేసి దాని ద్వారా పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేశామన్నారు యువతను సన్మార్గంలో నడిపించేందుకు ముస్లిం యువకులు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు జబీవుల్లా, కడప పట్టణ అధ్యక్షులు జీషాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments