అరబిక్ మదరసాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
చిట్వేలి లోని అమ్మాయిల అరబిక్ మదరసాలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు, ముఖ్య అతిథులుగా మండల తహసిల్దార్ శిరీష , కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ మస్తాన్ సాహెబ్ లు పాల్గొన్నారు.
మొదటగా తాసిల్దార్ శిరీష మదరసా కమిటీ సభ్యులతో కలిసి జండా వందన కార్యక్రమం చేశారు.తరువాత విద్యార్థినీలు దేశభక్తి గీతాలు మరియు స్వాతంత్ర సమరయోధుల గురించి ఉపన్యాసాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధులు ఎమ్మార్వో శిరీష మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు.వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశం గర్వించేలా విద్యార్థులు ఎదగాలని , ఇంత చక్కగా వసతులు కల్పించి ఉచితంగా విద్య మరియు చేతి వృత్తి పనులు నేర్పిస్తూ విద్యార్థుల ఉన్నతికి తోడ్పడుతున్న మదరసా యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.
తదనంతరం కడప సొసైటీ డైరెక్టర్ మస్తాన్ సాహెబ్ మాట్లాడుతూ సర్వ మత సమ్మేళనం మన భారతదేశం అని, కుల మతాలు ప్రాంతాలు అనే భేదాభిప్రాయం లేకుండా అందరం కలిసి మెలిసి దేశ ఉన్నతికి తోడ్పడాలని తో హితవు పలికారు. తదనంతరం అతిధుల చేతులు మీదుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినీలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జామియా మసీదు ప్రెసిడెంట్ గాడి ఇంతియాజ్ అహ్మద్, ముతవల్లి అల్లా బకాష్, వైస్ ప్రెసిడెంట్ షబ్బీర్ భాష, మదరసా ఆధ్యాపకులు మౌలానా జౌహర్ అలీ కాస్మి , విశ్రాంత ఉపాధ్యాయులు హుస్సేన్ ,రోషన్ జమీర్,గులాం భాష మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments