ఇందిరా నగర్ 2, 11కేవీ విద్యుత్ లైన్లు పునరుద్ధరణ - ఎమ్మెల్యే రాచమల్లు హామీ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాడు గోపవరం పంచాయతీ ఇందిరానగర్ 2 నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటించగా, ఇక్కడి గృహనివాసులు ఎమ్మెల్యే రాచమల్లుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు, 11కేవీ కరెంటు తీగల వలన తమకు ప్రాణహాని పొంచి ఉందని పలు సందర్భాలలో ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదని, గృహ నివాసాల మధ్య నుండి విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులు నాడు నిర్మించారని ఎమ్మెల్యే రాచమలకు వివరించారు. బుధవారం ఉదయం ఇందిరానగర్ 2 నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యటించి విద్యుత్ అధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణం పనులు చేయాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విడుదలైన నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో ఇంకా జమ చేయనందున పనులు ఆలస్యం అయ్యాయని, ఇప్పటికే ఇందిరానగర్ సమస్య విద్యుత్ అధికారుల దృష్టికి వచ్చిందని తెలియజేశారు. విద్యుత్ స్తంభాల మార్పుకు 3 లక్షల రూపాయల వ్యయం అవ్వనున్నట్లు ఇందులో భాగంగా దాదాపు 6 విద్యుత్ స్తంభాలు స్థానచలనం చేసి కొత్తవి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యుత్ అధికారులు ఎమ్మెల్యే రాచమల్లుకు తెలియజేశారు. గత పాలకులు ఇక్కడి ప్రజల సమస్యలను విస్మరించారని, రేపు డబ్బులు చెల్లించి త్వరలో పనులు పూర్తి చేస్తామని, అలాగే 20 సంవత్సరాల క్రితం నిర్మించిన సీసీ రోడ్డు ను పునరుద్ధరించడానికి తగు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల జేఏసీ కన్వీనర్ ఓబయ్య, కొండయ్య విద్యుత్ శాఖ అధికారులు ఏ డి ఈ వి.జి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments