బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరుగుతుంది. అమ్మవారిని పది రోజులు వివిధ అవతారాల్లో అలంకరిస్తారు. తొలిరోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దుర్గమ్మను అలంకరిస్తారు. ఉదయం 9గంటల నుంచి అమ్మవారు ఈ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. తొలి దర్శనం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చేసుకుంటారు. తదనంతరం సాధారణ భక్తులను అనుమతిస్తారు. కరోనా తర్వాత ఎలాంటి నిబంధనలు లేకుండా జరుగుతున్న తొలి శరన్నవరాత్రి మహోత్సవాలు కావడంతో రోజుకు 60-70 వేల మంది దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేశారు.
top of page
bottom of page
Comentarios