top of page
Writer's picturePRASANNA ANDHRA

ఐ.ఎన్.టి.సి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ

విశాఖపట్నం (ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి) విశాఖ జిల్లా ద్వారక నగర్ పబ్లిక్ లైబ్రరీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగినది. విశాఖ జిల్లా ఎం.పీ ఎం .వి .వి సత్యనారాయణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 36 మంది బలిదానాలు లో నెలకొన్న ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థల నుంచి తొలగిస్తామని. ప్రకటించిన దగ్గర్నుంచి ఈరోజు 395 రోజులు వరకు నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని కేంద్రం మొండి వైఖరి ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలని వాపోయారు దీని విషయం మీద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అదేవిధంగా అందరం కలిసి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకర వ్యతిరేకిస్తూ కేంద్రానికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దానికిగాను అవసరమైతే మేము కేంద్రం మీద పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియపరిచారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో నేను కార్మికుడిగా పని చేయడం నాకు గర్వకారణంగా ఉన్నదని కార్మికుల యొక్క మనోభావాలను దెబ్బ తీస్తూ కేంద్రం చేసిన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నానని. నిర్వాసితులకు కొన్ని వేల ఎకరాలు వదులుకోవడం వలన ఈ యొక్క ప్లాంట్ నిర్మాణానికి దోహదపడిందిఅని తెలిపారు. ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులు అప్పటిలో దాదాపుగా పాతిక వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ భూమిని కేటాయించిన నిర్వాసితులు వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఉపాధి కలగలేదని అలాగే ఇప్పటికీ 8 వేల ఆర్ కార్డులు ఉన్నాయని అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్ కార్డులు వారసత్వ పరిధి కలిగించడం తద్వారా వారసత్వం 8000 ఆర్ కార్డులు రావడం జరిగింది. ఈ యొక్క ప్రైవేటీకరణ వల్ల నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాఅని తెలిపారు ఇందులో భాగంగా వై ఎస్ ఆర్ టి యు సి మస్తాన్ అప్ప నిర్వాసితుల సమస్యలతోపాటు స్టీల్ ప్లాంట్ 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్ అని ఆర్ధికంగా కూడా నిలబడుతున్న ఈ ప్లాంట్ ను రికార్డుల పరంగా కూడా కార్మికులు చేస్తున్న పని విధానాన్ని అన్నీ కూడా గమనిస్తున్నా సరే పట్టించుకోని విధంగా కేంద్రం యొక్క మొండివైఖరి వలన విశాఖ జిల్లాకు ఆర్థికంగానూ ఇబ్బందులు కలుగుతాయని ఈ సందర్భంగా ఆయన వాపోయారు ఇతర కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 28 ,29 తారీకు రెండు రోజుల సమ్మె చేయడానికి కార్మిక సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగినది .ఈ సందర్భంగా సిఐటియు అయోధ్య రామయ్య మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది కార్మికులకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కార్మికులు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ సేవలు చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మినహాయించి నట్లయితే కార్మికులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అలాగే విశాఖ న్యాయం చేద్దాం ఆలోచన మానుకోవాలని అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున గట్టిగా కేంద్రానికి వినిపిస్తామని గతంలో కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది అయినా సరే కార్మికుల యొక్క పోరాటం ఇప్పటికీ 395 రోజులు పూర్తి చేసుకుంది కేంద్రం మొండి వైఖరిని విడన డకపోతే మరింత పోరాటం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అలాగే టిఎన్టియుసి బొడ్డి పైడిరాజు ప్లాంట్ ప్రైవేటీకరణకు అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికైనా వెనుకాడని కార్మికుల తరఫునుంచి విన్నవించారు. డివిఆర్ యూనియన్ రమణ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వాసితులకు అలాగే కార్మికులకు ఎంతో కాలంగా గుండెల్లో నిలిచిపోయిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అప్పట్లో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ కేంద్రం కుటిల స్వభావంతో ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ 36 మంది ప్రాణ త్యాగాల యొక్క అర్థం లేదని గతంలో కూడా కార్మిక కుటుంబ సభ్యులతో కలిసి రాస్తారోకో చేయడం కూడా జరిగింది. అయినా కేంద్రం మొండివైఖరి మారకపోతే మరొక వ్యవసాయ చట్టం బిల్లును వ్యతిరేకతను విధానంలోనే మా యొక్క పోరాటం కొనసాగుతుందని కేంద్రానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక తో ఆయన మాటల్లో తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు ఈ సభలో పాల్గొనడం జరిగింది.


7 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page