ఇంటర్ మొదటి సంవత్సరంలో మెరిసిన మాదినేని యోషిత.
--పొదలకూరు మండలంలో ప్రథమ స్థానం.
---స్టేట్ పరిధిలో 3 వ స్థానం కైవసం.
--యాజమాన్యం అభినందనల వెల్లువ.
---తల్లిదండ్రులలో అవధులు లేని ఆనందం.
గత నెలలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల తోపాటు,ఈరోజు వెలువడ్డ ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాలికలదే పైచేయిగా నిలిచింది.
2021-2022 విద్యా సంవత్సరానికి గానూ ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాలలో అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం, అనుంపల్లి గ్రామానికి చెందిన మాదినేని విశ్వనాథం లక్ష్మీదేవిల కుమార్తె మాదినేని యోషిత నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం లో గల కాకతీయ ప్రైవేట్ కాలేజీ నందు ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న యోషిత ఈరోజు ప్రకటించబడ్డ ఫలితాలలో 470 మార్కులకు గానూ 461 మార్కులు సాధించి పొదలకూరు మండలానికి మొదటి స్థానంలోనూ మరియు మన రాష్ట్ర పరిధిలో మూడవ స్థానంలో నిలిచింది.
కాలేజీ యాజమాన్యం, సదరు గ్రామస్తులు యోషిత కు, వారి కుటుంబ సభ్యులకు అభినందనల వెల్లువలు తెలియపరిచారనీ వారి తల్లిదండ్రులు తెలియపరిచారు.
వారి తల్లిదండ్రులతో యోషిత:
విజయంపై యోషిత మాటల్లో: ర్యాంకులు అన్నది కేవలం కార్పొరేట్ కళాశాలకే మాత్రమే పరిమితం కాదని; అధ్యాపకుల బోధనను అర్థం చేసుకుంటూ చక్కని ప్రణాళికలతో ముందుకెళితే అందరికీ సాధ్యమవుతుందని..రేపటి సంవత్సరంలో కూడా మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటానని, తన చదువుకు సహకరిస్తున్న తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, ఎప్పటికప్పుడు చదువులో మెళకువలు నేర్పుతున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు.
Comentarios