గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, గాజువాక యారాడ గ్రామం లో యాత శెట్టిబలిజ గౌడ ఈడిగ శ్రీశైన సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అండి బోయిన అప్పారావు, కడవల ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో రెండు కుటుంబాలకు నిత్యావసర వస్తువుల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఏపీ స్టేట్ యాత కార్పొరేషన్ డైరెక్టర్ న్యాయవాది అండిబోయిన లక్ష్మీ, యారాడ ఇంచార్జ్ ధర్మాల శ్రీను విచ్చేశారు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ యారాడ గ్రామం యొక్క సమస్యలను యాత కార్పొరేషన్ డైరెక్టర్ అండి బోయిన లక్ష్మీ తన దృష్టికి తీసుకు రావడం జరిగిందని అంతేకాకుండా భవనంపై నుండి పడిపోయినా వల్లి తోటయ్య కుటుంబానికి రీసు అంజమ్మ బ్లైండ్ ఫ్యామిలీకి రెండు నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులు బియ్యం పప్పులు బట్టల మహిళలకు చీరలు అందిస్తున్న అండి బోయిన లక్ష్మి కి యాత శెట్టిబలిజ గౌడ సంఘం వారికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అండి బోయిన లక్ష్మీ మాట్లాడుతూ గ్రామ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు వారిపైన ఇప్పటికి అరాచకాలు జరుగుతూనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం తీసుకొచ్చిన మహిళలకు భద్రతను కల్పిస్తున్న అప్పటికి కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ ఇంకా అరాచకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చప్పిడి నాగరాజు, కడవల నాయుడు అండి బోయిన సన్నీ, వంగల అప్పలరాజు, చెల్లి బోయిన సన్యాసిరావు ,వల్లి అప్పలరాజు, కండి పిల్లి రమణ చెల్లి బోయిన రాము, జాన్ యారాడ సంఘ సభ్యులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments