ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగ మహిళా శానిటరీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ
అగనంపూడి సీడబ్ల్యూసీలో జీవీఎంసీ 85 వ వార్డు సచివాలయ శానిటరీ, పర్యావరణ కార్యదర్శిలుని బలిరెడ్డి సత్యనారాయణ ఘనంగా సన్మానించారు .ప్రజావేగు పట్టా రామ అప్పారావు సౌజన్యం లో శానిటరీ సిబ్బందికి యాఫ్రాన్సు అందజేశారు.
జీవీఎంసీ సిక్స్త్ జోన్ శానిటరీ సూపర్వైజర్ బీవీ రామరావు మాట్లాడుతూ విశాఖ నగరం పరిశుభ్రత లో శానిటరి సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షణ పోటీలో విశాఖ నగరం ప్రథమ స్థానం రావడానికి నగర ప్రజలు శానిటరి సిబ్బందికి సహకరించాలని కోరారు.
బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా రాజ్యాంగంలో పొందుపరిచిన మహిళా హక్కులను ప్రభుత్వాలు అములుపరచలేదు వాటిని అమ్ములు పరిస్తే మహిళలు సర్వతో ముఖ అభివృద్ధి సాధించగలరని, ఉన్నత చదువులు చదువుకున్న సచివాలయ కార్యదర్శిలు గా చేరాలని వారికి మరుగుదొడ్ల మెయింటెనెన్స్ అప్పచెప్పడం వారి మనోభావాలు దెబ్బ తింటాయి అని కావున ప్రభుత్వం వారికి చదువుకున్న చదువుకు తగ్గ హోదా గల విధినిర్వహణలు అప్పు చెప్పాలని కోరారు.
పట్టా రామా అప్పారావు సభాధ్యక్షత వహించగా కొండయ్య వలస సచివాలయము శానిటరీ,పర్యావరణ కార్యదర్శి వందన సమర్పణ చేసిన కార్యక్రమంలో లో 85 వ వార్డు సచివాలయలు శానిటరీ, పర్యావరణ కార్యదర్శులు నెల్లి భవాని, శ్రీమతి కె ఉమాదేవి, ఎస్ దేవి మరియు శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments