గోపాల్ ఈ-స్కూల్ సమ్మర్ కల్చరల్ క్యాంప్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
యువతలో నైతిక విలువలు పెంపొందిస్తూ, ఇతిహాసాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోపాల్ ఈ-స్కూల్ సమ్మర్ కల్చరల్ క్యాంప్ వారు ఈ వేసవి సెలవులలో మే ఒకటవ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భగవద్గీత శ్లోకాలను సులభమైన పద్ధతిలో అర్థవంతంగా ఆచరించే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు, శిక్షణ కాలం ముగిసిన తర్వాత మే 14వ తేదీన పరీక్షలు నిర్వహించి మొదటి మూడు బహుమతులతో పాటు మరో పది మందికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు మంగళవారం మధ్యాహ్నం స్థానిక ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా తాము ఇస్కాన్ సంస్థకు చెందిన మధురేష్ ప్రభు ఆధ్వర్యంలో సమ్మర్ కల్చరల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సమ్మర్ క్యాంప్ ఇంచార్జ్ శబరీష్, జయ రామ్మోహన్ లు తెలిపారు. కావున ఏడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు స్థానిక ఇస్కాన్ మందిరము నందు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా వారు కోరారు.
Comentarios