ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత కాంటెస్ట్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
చిన్నారుల హృదయాలలో ఆధ్యాత్మిక, వికాసాన్ని, నైతిక విలువలను, నాయకత్వ లక్షణాలను, జీవితం యొక్క విలువను పెంచే క్రమంలో ఇస్కాన్ గోపాల్-ఈ-స్కూల్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ వారు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, డిసెంబర్ ఒకటో తేదీ నుండి పై కాంటెస్ట్ కు ఎంపిక జరగనున్నదని ఇందుకు గాను 8 నుండి 14 సంవత్సరము వయసు గల బాల బాలికలు 15 శ్లోకములు వాటి భావములతో సహా చెప్పవలెనని, డిసెంబర్ 8వ తేదీన చివరి ఎంపిక అర్హత విధానమునకు 30 శ్లోకములు వాటికి భావముతో చెప్పిన అభ్యర్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి, మొదటి బహుమతిగా పదివేల రూపాయలు, రెండో బహుమతిగా 5000 రూపాయలు, మూడో బహుమతిగా 2500, రూపాయలు 1000 చొప్పున మూడు కన్సోలేషన్ బహుమతులు అందిస్తామని అన్నారు. ఇందుకుగాను నవంబర్ 24వ తేదీన భగవద్గీత పై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేదీ 21 నవంబర్ 2024 గా పేర్కొన్నారు. పై కాంటెస్ట్ నందు పాల్గొనదలచిన వారు ప్రొద్దుటూరులోని ఇస్కాన్ మందిరం నందు లేదా 8520027510, 6303474393 నంబర్లను సంప్రదించవచ్చునని ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించిన శబరీష్, రామ్మోహన్, రాధా పాద వల్లభ లు తెలియజేశారు.
Comentarios