హెచ్ ఐ వి బాధితులను చులకనగా చూడటం నేరం - జూనియర్ న్యాయ మూర్తి కే లత
ఎయిడ్స్ డే పై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించిన చైర్మన్, మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ , జూనియర్ న్యాయ మూర్తి కే.లతా .
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులను చులకనగా చూడకుండా వారిపట్ల మానవుతా దృక్పదంతో ఉండాలని, వాళ్లకి ధైర్యం చెప్పాలని తెలియజేశారు. ఎయిడ్స్ వ్యాధికి గల కారణాలు, ఎయిడ్స్ రాకుండా నివారణ చర్యలు గురించి తెలియజేశారు. యువతలో మార్పు రావాలని, డ్రగ్స్ అడిక్ట్ కావడం వల్ల , ఇంజక్షన్ల ద్వారా, డ్రగ్స్ వాడటం వలన , పచ్చబొట్ల ద్వారా, రక్తమార్పిడి ద్వారా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉందని తెలిపారు.
హెచ్ఐవి బాధితులను చులకన చేయరాదని వారికి సరైన ఆహారము, చికిత్స అందించడం ద్వారా వారికి కొంతవరకు నయం చేయవచ్చు అని తెలిపారు. హెచ్ఐవి బాధ్యతలు కూడా సమాజంలో సమాన హక్కులు ఉంటాయని తెలిపారు. ప్రతి పౌరుడు తన కుటుంబం సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ నేరాలు ఆహ్వానించకుండా ఉన్నత పౌరులు ఎదగాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి .నరసింహులు హెచ్ .ఆనంద్ కుమార్, ఎస్. మహమ్మద్ అలీ, ఏ.వి సుబ్రహ్మణ్యం, జానీ, సెమీవుల ఖాన్, మోహన్, రాబిన్, పోలీసు వారు , పిఎల్్ వీలు , కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comentários