విద్యార్థి అనాథ శరణాలయంలో జాప్ ఆవిర్భావ వేడుకలు
ప్రొద్దుటూరు, జర్నలిస్టు యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు అధ్యక్షులు నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం విద్యార్థి అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాప్ ఫౌండర్ ఎంయుజే మాజీ అధ్యక్షులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ ఉప్పల్ లక్ష్మణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ యూనియన్ ను బలోపేతం చేసి జాప్ ను 31 సంవత్సరాలుగా అలుపెరి పోరాటం చేస్తున్న పోరాడుతున్న ఉప్పల లక్ష్మణ్ కి అభినందనలు తెలిపారు. యూనియన్ నిలబడి ఉందంటే ఉప్పల లక్ష్మణ్ కృషి పట్టుదలే అని వక్తలు కొనియాడారు. అలాగే ఈ 31 సంవత్సరాలుగా జాప్ కోసం జర్నలిస్టుల సమస్యల కోసం అలుపెరుగని పోరాడిన, పోరాడుతున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాప్ ప్రొద్దుటూరు ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహులు, కార్యదర్శి గంజి సురేష్, అసోసియేషన్ నాయకులు మహ్మద్ రఫీ, ఎస్. నరసింహులు, కిరణ్, బాబు, ప్రణయ్, ముస్తాక్, బాలసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments