టిడిపి గెలుపును బాబుకు బహుమతిగా ఇస్తాం - మాజీ వైస్ చైర్మన్ జబీవుళ్ల
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
చిన్నపాటి వివాదం తమ మనోభావాలను దెబ్బతీసినందు వల్లనే తాము వైసీపీకి దూరమయ్యామని ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జెబిఉల్లా తెలిపారు. సోమవారం ఉదయం ఆయన 22వ వార్డు కౌన్సిలర్ గౌస్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పలు రకాల కారణాలు తమని, తమ కుటుంబ సభ్యులను, అనుచర వర్గాన్ని వైసీపీకి దూరం చేసిందని, రాబోవు ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు వైసిపికి గట్టి బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. తాను 2019 ఎన్నికల నందు వైసీపీ కండువా కప్పుకోలేదని, తమ కుటుంబ సభ్యుడైన తన అన్న మొహమ్మద్ ఆజ్ఞల మేరకు తాము పార్టీలో చేరామని, పలు వార్డులు ఏకగ్రీవం చేయటంలో తాము కృషి చేశామని, మసీదు ప్రహరీ గోడ కూల్చడమే తమ మనోభావాలను దెబ్బతీసిందని, ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని కాపాడే పార్టీ తెదేపా అని, అందుకే తాము ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు. తాము తమ కుటుంబ సభ్యులు ఎవరికి శత్రువులను కాదని పార్టీలపరంగా ప్రత్యర్థుల మేనని గుర్తు చేశారు. రాబోవు ఎన్నికలలో అధినేత ప్రొద్దుటూరులో ఎవరికి టికెట్ ఇచ్చినా, టిడిపిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇస్తామని ఆయన జోష్యం తెలిపారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ గౌస్, మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Comments