వరదను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది - మాజీ వైస్ చైర్మన్ జబీవుల్ల
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మే నెల 13వ తేదీ జరుగునున్న ఎన్నికలలో ప్రధానంగా ఇరు పార్టీలు బరిలో ఉన్నాయని, ఈ సందర్భంగా గతంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగరనివ్వను అని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ జిబిఉల్లా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, రాచమల్లుకు ఎందుకు ఓటు వెయ్యాలి? ఎందుకు ఓటు వేయకూడదు? అనే అంశాలపై ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడుతూ, బీసీ కులానికి చెందిన నందం సుబ్బయ్య హత్యను ప్రస్తావిస్తూ, ఇప్పటికీ హత్యకు కారకులైన నిందితులు శిక్ష పడలేదని, బీసీలను భయపెట్టాలని చూస్తూ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ ను పక్కన పెట్టారని, గతంలో అతన్ని కూడా బెదిరించిన కారణంగా ప్రస్తుతం రమేష్ యాదవ్ ప్రొద్దుటూరులో ఉనికి కోల్పోయారని, ప్రోటోకాల్ ప్రకారం రమేష్ యాదవ్ ను ఏ కార్యక్రమానికి ఆహ్వానించక పోవటాన్ని గుర్తు చేశారు.
ఓటుకు నోటు ఇవ్వటానికి సిద్ధపడ్డ వైసిపి నాయకులు ఈ ఎన్నికలలో వేల రూపాయలు ప్రతి ఓటుకు ఇచ్చిన ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని, అయితే వైసీపీ వారి దగ్గర డబ్బులు తీసుకుని టిడిపికి ఓట్లు వేయండి అంటూ జబీఉల్ల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దాయనగా పిలువబడే వరదరాజులే సరైన వారిని ప్రజల నిర్ణయించుకున్నారని, కావున ప్రజలు వరదను గెలిపించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అసాంఘిక కార్యకలాపాలు అంతమొందించి ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పాణ్యం సావిత్రమ్మ ఆమె భర్త సుబ్బరాయుడు పాల్గొన్నారు.
Commentaires