జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు వరం - ఎమ్మెల్యే రాచమల్లు
కడప,జిల్లా, ప్రొద్దుటూరు
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఎమ్మెల్యే రాచమల్లు, చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించుకున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాబోవు నెల రోజులు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు, ప్రభుత్వ వైద్యాధికారులు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వయానా వెళ్లి రక్తపోటు, మధుమేహ, రక్త శాతం, జ్వరం, టీబీ, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి ఇతర పరీక్షలు కూడా ఇంటి వద్దనే నిర్వహించి ఫలితాలు తెలిపి అనారోగ్యం బారిన పడిన వారికి ప్రభుత్వం తరఫున ఉచిత చికిత్స అందించనున్నట్లు, ఇది పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు వరం లాంటిదని ఆయన భావించారు. కావున ఇంటి వద్దకు వచ్చిన ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందిని ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తగు పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments