top of page
Writer's pictureEDITOR

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, నందులూరు మండలాధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి సచివాలయం 1 పరిధిలో క్రీడా మైదానం హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి 3225 వ్యాధులకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందించడం జరుగుతుందన్నారు. పేదలు గతంలో వైద్యం పొందాలంటే ఇబ్బందులు పడే వారన్నారు. నేడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మంచి అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లచే రోగులకు వైద్యం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఈ మధ్యకాలంలో రాజమండ్రి దగ్గర ఒక వ్యక్తికి ఎంతో ఖర్చుతో కూడిన జబ్బు రావడంతో అతని వ్యాధి నయం చేసేందుకు ఇతర దేశాల నుంచి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ తెప్పించి ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఇంటికి వైద్యులు వెళ్లి రోగుల జబ్బు నయం చేసే విధంగా ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వ్యాధులకు ఈ క్యాంపుల ద్వారా ఉచిత వైద్యం పొందాలన్నారు

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సౌభాగ్యం, నాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ , నందలూరు మండల ఉపాధ్యక్షులు అనుదీప్ సింహ , అన్నమయ్య జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ , వైయస్సార్సీపి రాష్ట్ర యువజన కార్యదర్శి నడివీధి సుధాకర్ , వైఎస్ఆర్సిపి పార్టీ నందలూరు మండల అధ్యక్షుడు నాగేంద్ర ,ఎలుమలై బషీర్ , మండల వైద్యాధికారులు సృజన, చంద్ర శేఖర్ రెడ్డి, వైద్య సిబ్బంది వాలంటీర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

31 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page