కడప జిల్లా, చిట్వేలి : నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు ఊతం లాంటిదని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈరోజు మధ్యాహ్నం చిట్వేలు ఎంపీడీవో కార్యాలయం నందు జరిగిన జగనన్న తోడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారాలు చుట్టూ తిరగకుండా వారి ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచే దిశగా సమున్నత లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి , కరోనా కష్ట సమయంలోనూ వరుసగా మూడో ఏడాది లబ్ధిదారులకు వడ్డీలేని రుణాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు నమోదు కాని వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపి సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో సమత, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Comments