జగనన్న ఇళ్లపై ఎమ్మెల్యే రాచమల్లు శుభవార్త తెలియచేశారు.
కడపజిల్లా, ప్రొద్దుటూరు
మంగళవారం ఉదయం మునిసిపల్ కమిషనర్ చాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలలో రాజశేఖర్ రెడ్డి హయాంలో మాత్రమే పేదలకు ఇళ్ళు ఇచ్చారని, ఆ తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, ప్రొద్దుటూరులో పేదలకు ఇళ్లు నిర్మించాలనే ఉదేశంతో 24000 మందికి ఇళ్లపట్టలు పంపిణీ చేసామని గుర్తు చేశారు. 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 19000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసామని, 1,80,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా 19000 ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందచేసామన్నారు.
ఇంటి నిర్మాణానికి ఇంకో 70,000 రూపాయలు అవసరం అవుతోంది కనుక లబ్ధిదారులు అంత ఖర్చు పెట్టుకోలేకున్నారు కనుక, అందువలన పెద్ద కాంట్రాక్టర్లతో మాట్లాడి ఒక్కొక్కరు 35,000 రూపాయలు మాత్రమే చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని, ఆ 35,000 రూపాయలు కూడా పొదుపు సంఘాల ద్వారా బ్యాంకు రుణం మంజూరు చేయించే బాధ్యత తనదేనని భరోసానిచ్చారు. పొదుపులో లేని మహిళలు ఎదో ఒక పొదుపు గ్రూప్ లో చూపించి బ్యాంకు ద్వారా రుణం వచ్చేలా చేస్తామన్నారు.
ఇళ్లకు అవసరమయ్యే ఇసుకను తక్కువ బాడుగతో తమ సొంత ట్రాక్టర్ల ద్వారా అందిస్తామని, ఇళ్లకు పెట్టాల్సిన 4 కిటికీలో ఒక కిటికీని తగ్గిస్తున్నాముని, అది కూడా ప్రతీ ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వలనే సదుద్దేశంతోనే చేస్తున్నాం అని హితవు పలికారు. మహిళలు ప్రతి ఒక్కరు పొదుపు సంఘాల ద్వారా రుణం మంజూరు చేయించుకునేందుకు అధికారులను సంప్రదించాలని, ఇందులో తాము ఒక్క రూపాయి కూడా తమ సొంత డబ్బులు పెట్టడం లేదని, ప్రతీది బ్యాంక్ ద్వారా కాంట్రాక్టర్ కు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు.
תגובות