top of page
Writer's picturePRASANNA ANDHRA

ఇక జగనన్న పల్లె ప్రగతి కార్యక్రమం - ఎమ్మెల్యే రాచమల్లు


ఇక జగనన్న పల్లె ప్రగతి కార్యక్రమం - ఎమ్మెల్యే రాచమల్లు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రూపొందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పార్తీకేయుల ఆయన మాట్లాడుతూ సోమవారం సాయంత్రంతో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగియనున్నదని, ఈ కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం రాజుపాలెం మండలం కొట్టాల గ్రామంలో పర్యటించనున్నారు. కార్యక్రమం ద్వారా గడచిన రెండువొందల పదమూడు రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలలోని ముప్పై గ్రామ పంచాయతీలు, నలబై తొమ్మిది గ్రామాలలో దాదాపు తొంబై మూడు వేల గడపలు, ఎనబై మూడు సచివాలయాల ప్రజలను తాను స్వయంగా కలిసే అవకాశం కలిగిందని, ప్రజల సమస్యలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఎప్పటికప్పుడు తనకు సహకరించి తనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులకు, పార్టీ నాయకులకు, సచివాలయ, గ్రామ వాలంటరీ వ్యవస్థకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధిలోని నలబై ఒక్క వార్డులలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతంగా పూర్తి చేశామని, గ్రామాలలో మురికినీటి కాలువలు, విద్యుత్ స్థంబాలు, తీగెల సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకుని వచ్చారని, జగనన్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తాను ప్రతిరోజు ఒక గ్రామంలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన భరోసానిచ్చారు. ఇదిలా ఉండగా గడప గడప కార్యక్రమం నియోజకవర్గ పరిధిలో నేటితో ముగింపు కావటం తనకెంతో భాధను కలిగిస్తోందని, ప్రజల మధ్యలో ఉండి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకోవడం తనకు ఇష్టం అని, అవగాహన రాహిత్యం, సాంకేతిక కారణాల వలన సంక్షేమ పధకాలు అందని లబ్ధిదారులకు అధికారులతో చర్చించి పధకాల లబ్ది అందేలా కృషి చేశామని అన్నారు. సంక్షేమ పధకాల అమలులో పారదర్శకంగా వ్యవహరిస్తున్న తమ ప్రభుత్వంపై, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విఫలం అయ్యిందని ప్రతిపక్ష నేత నారా చంద్ర బాబు నాయుడు వ్యాఖ్యానించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికలకు రెండే సంవత్సరాల ముందే గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్లే అవకాశం తమ ఎమ్మెల్యే లకు కలగటం అదృష్టంగా అయన భావిస్తూ రానున్న రోజుల్లో ప్రత్యేకించి ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో తాను జగనన్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తిరిగి గ్రామాల పర్యటన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు పాల్గొన్నారు.


109 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page