జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీ
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ పాత అమృత నగర్, 16వ వార్డు నందు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వార్డ్ మెంబర్ మోష గురువారం ఉదయం పాఠశాలలోని దాదాపు 300 మంది పిల్లలకు జగనన్న విద్యా దీవెన కిట్ల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాల నుంచి తమ ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్దపీటను వేస్తూ, ప్రతి పేద విద్యార్థి కూడా ఉత్తమ విద్యను అభ్యసించాలని కాంక్షించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద లాంటి పథకాలను ప్రవేశపెట్టి తల్లిదండ్రులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ, ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా శిధిలావస్థకు చేరిన పాఠశాలలను కూడా నాడు-నేడు కార్యక్రమం లో భాగంగా అందంగా తీర్చిదిద్ది విద్యార్థినీ విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చారని, భవిష్యత్ తరాలు ఉత్తమ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Comments