వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు
శుక్రవారం సాయంత్రం స్థానిక సంజీవ్ నగర్ లో జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జే శ్రవణ్ కుమార్ కడప జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న రమేష్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని జై భీమ్ భారత్ పార్టీ నీ ఒక రాజకీయ పార్టీల కాకుండా ప్రజా సమస్యలపై ప్రజా హితం కోరుతూ ముందుకు తీసుకు వెళ్తామని ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ దృష్టి సారించి కార్యాలయానికి సమస్యలంటూ వచ్చిన వారికి తగు న్యాయం జరిగేలా తాము తమ పార్టీ నాయకులు కృషి చేస్తారని ఆయన అన్నారు.
ప్రస్తుత సమాజంలో సామాన్యుడికి న్యాయం జరగటం లేదని లక్షలు వెచ్చించి ప్రజాస్వామ్యంలో న్యాయం పొందవలసిన దుస్థితి ఏర్పడిందని రాష్ట్రవ్యాప్తంగా తమ కార్యాలయాలలో పేదవాడికి న్యాయం అందేలా తగు చర్యలు తీసుకుంటున్నామని రాయలసీమ అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉందని ఎస్సీల చేతిలో భూములు లేవని నాయకులు అధికారుల చేతిలో ఉందని న్యాయం పేదవానికి అందించేందుకు పోలీసులు సహకరించటం లేదని అందుకనే తాము జై భీమ్ పార్టీ కార్యాలయం రాయలసీమలో ప్రధమంగా ప్రొద్దుటూరు నందు ఏర్పాటు చేశామని ఇక్కడికి వచ్చిన బడుగు బలహీన వర్గాలకు 24 గంటల్లోగా తమ 50 మంది లాయర్లచే లీగల్ ఒపీనియన్ లేదా శాశ్వత పరిష్కార దిశగా సమస్యపై శ్రద్ధ చూపుతామని ఆయన అన్నారు. అనంతరం కడప జిల్లా అధ్యక్షుడు పల్లె రమేష్ మాట్లాడుతూ ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజా సమస్యలపై తాను గతంలో చేసిన పోరాటాలు బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవను గుర్తించి తన అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రజలకు సమస్యలపై వచ్చే బడుగు బలహీన వర్గాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు జై కుమార్ కొండలరావు సురేష్ రాజేష్ నియోజకవర్గ ప్రధాన కార్యకర్తలు సురేష్ నరసింహ బద్రి హర్ష శాంతయ్య ప్రకాశం శ్రీనివాసులు కుమార్ ఎస్ సురేష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Comments