కలమల్ల గ్రామంలోని జమల్ అలీ దర్గా ఘనంగా ఉర్సు నిర్వహించారు
ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని జమల్ దర్గా ఉరుసు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా మత పెద్దలు రిజ్వీ షేక్ షాషా వలి మాట్లాడుతూ కలమల్ల గ్రామంలో వెలిసిన జమల్ అలీ దర్గా 509 సంవత్సరం నాటి కాలానికి చెందినదిని తెలియజేశారు, గంధము, జండా లతో గ్రామం మొత్తం ఊరేగించారు. దర్గా దగ్గర ప్రతి నెల పున్నమి రోజు రాత్రి నుంచి ఉదయం వరకు కవాలి ఉంటుందని, మత గురువు నూర్జహాన్ బి భవిష్యవాణి వినిపించారు. మత గురువు సైక్ వల్లి మాట్లాడుతూ హజరత్ సయ్యద్ జమల్ అలీ స్వామి అత్యంత మహిమ ఉందని నమ్మకంతో ఇక్కడకు వచ్చిన భక్తులందరికీ బాధలు తొలగిపోయాయని స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని వచ్చే భక్తుల కోరికలు నెరవేరుస్తారని తెలియజేశారు.
Comentarios