వైసీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేశారు - రామంజినేయ రెడ్డి
శుక్రవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ జె. వెంకటలక్ష్మి ఇంటి ప్రక్కన నివాసముంటున్న నక్క రామకృష్ణ ఇంటి నందు 33 మూటల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీన పరచుకోగా, వైసీపీ నాయకులు అలాగే వైసిపి సోషల్ మీడియా తాను తన కుటుంబ సభ్యులు అక్రమ రేషన్ బియ్యం దందాను నడుపుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో వీడియోలు జొప్పించి వాటిని వైరల్ చేశారని, కాగా తనకు గాని తన కుటుంబానికి కానీ అక్రమ రేషన్ దందాతో ఎటువంటి సంబంధాలు లేవని ఇందుకుగాను తాను కాణిపాక వరసిద్ధి వినాయక సాక్షిగా ప్రమాణం చేయటానికైనా సిద్ధమని మూడవ వార్డు కౌన్సిలర్ భర్త జంబాపురం రామాంజనేయుల రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
శనివారం సాయంత్రం 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామాంజనేయుల రెడ్డి మాట్లాడుతూ, తమ ఇంటి ప్రక్కన నివసిస్తున్న రామకృష్ణ ఇంట్లో 33 మూటల రేషన్ బియ్యం లభ్యం కాగా, ఈ రేషన్ దందాను తమకు అంటగడుతూ తమ కుటుంబం పై వైసీపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయటమే కాకుండా సామాజిక మాధ్యమాలలో వీడియోను వైరల్ చేశారని, ఈ చర్యల వల్ల తాము మానసిక వేదనకు గురయ్యామని, తాను తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే అందుకు జవాబు దారి ఎవరని ప్రశ్నించారు? పలువురు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారని అట్టివారిపై సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాలలో తమపై దుష్ప్రచారాలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఐదో వార్డ్ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఉదయం మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పత్రికా ముఖంగా నాటి వైసిపి ప్రభుత్వ హయాంలో తాము ట్రాక్టర్లతో ఇసుక దందా నడిపినట్లు ఒప్పుకున్నాడని, అయితే అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాను ఒక ఇసుక రేణువు కూడా అమ్మలేదని పలుమార్లు చెప్పినట్లు గుర్తు చేస్తూ, నాటి ఎంఎల్ఏ రాచమల్లు మాటలకు నేటి వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి మాటలకు ఇప్పుడు ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు? సమావేశంలో కౌన్సిలర్ మునీర్ టిడిపి నాయకులు శ్రీనివాసులు రెడ్డి (వాసు) తదితరులు పాల్గొన్నారు.
Comments