ఓమిక్రాన్ పెరుగుదల దృష్ట్యా జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ ఈ క్రింది విధంగా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన సంవత్సర వేడుకలను ఇంటి వరకే పరిమితం చెయ్యండి లేకపోతే పోలీస్ స్టేషన్ లో పోలీసు వారితో జరుపుకోవాల్సి వస్తుంది.
31.12.2021 వ తేది రాత్రి జిల్లా వ్యాప్తంగా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
ప్రార్థనాలయాలు వద్ద జరుపుకొను ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క కరోనా వైరస్ నియంత్రణ కొరకు విధించిన నియమ నిబంధనలను తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి.
రాత్రి పూట బార్లలో మద్యం తాగి వేడుకులు నిర్వహించడానికి అనుమతులు లేవు. హోటళ్లలో పార్టీలకు అనుమతులు లేవు.
31వ తేదీ రాత్రి సామూహిక పార్టీలు లేవు. అర్ధ రాత్రి వేళ రోడ్లపై యువత విచ్చలవిడిగా తిరగడానికి వీల్లేదు.
శుభాకాంక్షలు తెలుపుకునే సమయంలో కోవిడ్ నియమ నిబంధనలు ప్రకారం మాస్కులు శానిటైజర్ లు తప్పనిసరిగా వాడాలి.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు, యువత పోలీసులకు సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు తెలియ చేసినారు.
అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బృందాలు స్పెషల్ పార్టీ లు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి నగరంలో గస్తీ చేపడతారు.
ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకోనబడుతాయి.
యువతకు హెచ్చరిక:-
యువకులు అర్ధరాత్రివేళ మద్యం మత్తులో ఇతరులకు ఇబ్బందికరంగా ద్విచక్రవాహనాలపై పెద్ద శబ్దంతో హారన్ లతో, కేకలతో వీధులలో సంచరించరాదు. అలా చేస్తే మీ వాహనాలు సీజ్ చేయబడతాయి.
留言