జనవిజ్ఞాన వేదిక అధ్వర్యంలో బహుమతులు అందజేత
సమాజంలో శాస్త్రీయ దృక్పథం నెలకొల్పడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని జెవివి జిల్లా నాయకులు షేక్ రౌఫ్ బాష..నందలూరు మండల నాయకులు G. కృపానందం.. .M. V. రమణ.. తెలిపారు. శుక్రవారం స్థానిక నందలూర్ హై స్కూల్లో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విభాగాల్లో మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు సైన్స్ భావజాలాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. వాస్తవికత, మూఢచారాల మధ్య తేడాలను వివరించారు. టాలెంట్ టెస్ట్‌లో ప్రయివేట్ స్కూల్ విభాగంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానం.. రెండవ స్థానం..మూడవ స్థానం ఆల్విన్ మౌంట్ కార్మెల్ స్కూల్ రెండు టీంల విద్యార్థులు సాధించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పాటూరు స్కూల్ విద్యార్థులు మొదటి స్థానం..నందలూరు స్కూల్ విద్యార్థులు రెండవ స్థానం.. MJPAP. B. C.. బాలికల గురుకుల పాఠశాల కు చెందిన విద్యార్థులు మూడవ స్థానం సాధించారు.. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు,పతకాలు.,మొమెంటో లు అందజేశారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల H. M... శ్రీనివాసులు.. STU నాయకులు షఫీఉల్లా....UTF నాయకులు రమేష్...JVV నాయకులు బాబు, మనోహర్, నాగలక్మి, శ్రీదేవి,తదితరులు పాల్గొన్నారు.
Comments