చిత్తూరు జిల్లా, సదాశివ పురం గ్రామంలో సుమారుగా నెల రోజులుగా ఇక్కడ మేకలు గొర్రెలు ఏదో తెలియని వింత వ్యాధితో మరణిస్తున్నాయని. ఈ విషయాన్ని గ్రామస్థులు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి ఆధ్వర్యంలో సదాశివ పురం గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా గ్రామస్తులతో సమస్య గురించి తెలుసుకున్న సాయి స్థానిక పశువైద్యాధికారి తో మాట్లాడి సమస్య వివరించి, గ్రామంలో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, మరణించిన మేకలకు ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం ప్రకటించి బాధితులను ఆదుకోవాలని కోరడం జరిగింది. అలాగే పశు వైద్యశాలకు వెళ్లి వైద్యాధికారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొట్టేసాయి, జనసేన నాయకులు కుమార్,చిరంజీవి,షణ్ముగం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments