చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరు గిరిజన కాలనీ నందు జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు రాఘవేంద్ర మరియు వీర రాఘవులు వీళ్ళ ఆర్ధిక సహాయంతో గణతంత్ర దినోత్సవ సందర్బంగా కాటూరు M. P. P స్కూల్ నందు 20 మంది గిరిజన పిల్లలకు నోట్ బుక్స్, పలకలు, పెన్సిల్, పెన్నులు మరియి నిత్య సామాగ్రి పంపిణి చేయడం జరిగింది. అనంతరం తడ శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన కాలనీ నందు పాఠశాలలో మెరుగైన వసతులు కూడా లేకపోవడం వంట గది, తాగునీటి సౌకర్యం, స్కూల్ కాంపౌండ్ కుడా నోచుకుని స్థితిలో పాఠశాల ఉంది కావున ఉన్నత అధికారులు ఈ పాఠశాలపై ద్రుష్టి సారించి ఈ వసతులు అన్ని కలిపించాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జయప్రకాశ్ మరియు జనసేన నాయుకులు పోలయ్య, సుగంధర్, కోదండ రామయ్య, సునీల్, గాంధీ, నవీన్, కళ్యాణ్, వసంత్ రావు, బాలాజీ, స్వచ్చ భారత్ కన్వీనర్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Opmerkingen