వృద్ధాప్యం, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళా, మరియు ఇతర పెన్షన్ నిబంధనలు సవరణకై, కృషి చేయాలని జనసేన పార్టీ కోరడం జరిగినది
గాజువాక, ప్రసన్న ఆంధ్ర జూన్ 26
మన రాష్ట్రంలో ప్రజా సంక్షేమంలో భాగంగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, మరియు కిడ్నీ, ఒంటరి మహిళా వారికి ఇతరత్రా పెన్షన్లు ఇస్తున్నటువంటి విషయం మీకు తెలిసినదే అయితే 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పెన్షన్ కోత పెట్టి కొత్త పెన్షన్లు ఇవ్వకుండానే చేసి ఉన్నారు గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వందలాది మందికి పెన్షన్ ఇచ్చినటువంటి విషయం మీ దృష్టికి తీసుకు వస్తున్నాను అప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పెన్షన్ లను వివిధ కారణాలు చెప్పి పెన్షన్ తీసివేశారు. దానికి సచివాలయం సిబ్బంది చెపుతున్న కారణాలు కరెంట్ బిల్ ఎక్కువ ఉందని, ఇంటి పన్ను అధికంగా వచ్చిందని, కుల ధ్రువీకరణ పత్రా, కావాలని వివిధ కారణాలతో ఉన్న పెన్షన్లను మరీ కొత్త పెన్షన్ఇవ్వకుండా చేసింది వైసిపి ప్రభుత్వం.
నేను చెప్పదలచుకున్నది మీ దృష్టికి తీసుకు వస్తున్నది ఏమిటంటే ఏ కులము లోనైనా వృద్ధాప్యం వస్తది, వితంతు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు వళ్ళకి కాస్ట్ తో సర్టిఫికెట్ తో సంబంధం లేకుండా 2014లో మీ హాయం లోఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే పెన్షన్ నమోదు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా సవరణ చేయవలసిందిగా కోరుచున్నాను.
ఇక వంటరి మహిళలకు మీ హాయంలో కార్పొరేటర్, ఆర్ కౌన్సిలర్, ఆర్ గ్రామ పెద్దలు సర్టిఫికెట్ చేసిన తర్వాత ఎమ్మార్వో సర్టిఫికెట్ ద్వారా 35 సంవత్సరాల కి ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చి ఉన్నాము కానీ వైసీపీ ప్రభుత్వము తరువాత విడాకుల పత్రం తప్పనిసరి చేసింది అందుమూలంగా చాలా మందికి పెన్షన్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో కూడా తమరు విడాకుల పత్రం తప్పనిసరి కాకుండాను అలాగే వయసు 30 సంవత్సరాల కు తగ్గించే విధంగాను గవర్నమెంట్ తో మాట్లాడుతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో పెన్షన్ వచ్చే విధంగా సూచిస్తారని ఆశిస్తున్నాను.
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ వైస్ చైర్మన్ 75 వ వార్డు అవార్డు జనసేన అధ్యక్షులు కోన చిన్న అప్పారావు , దాసరి జ్యోతి, ఏ దీపక్, నాయుడు ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వినతిపత్రం అందజేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా వ్యవహరించి ఈ విషయం పైన అటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచి త్వరితగెత్తిన పెన్షన్లు సంబంధించి ప్రతిదీ కూడా నిబంధనలను మార్పులు చేస్తానని ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకు తెలియపరిచారు.
Commentaires