ప్రజా సమస్యలపై పట్టు బిగిస్తున్న జన సైన్యం - భూకబ్జాలు అడ్డుకోవాలని ఎమ్మార్వో కు వినతి - పరిష్కరించకపోతే రిలే దీక్షలు తప్పవు - జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర.
జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో పెనగలూరు మండలం లో పలు సమస్యలపై ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసారు. ముఖ్యంగా సిద్ధవరం వెళ్లే రోడ్డు మార్గం లో భూ వ్యవసాయ డికెటి భూముల కబ్జా కి సహకరిస్తున్న అధికారపక్ష నేతల పై ఎమ్మార్వో మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర మాట్లాడుతూ నవంబర్ 19న వరదలకు కొట్టుకుపోయిన సిరివరం, ఎన్ ఆర్ పురం ప్రజల వ్యవసాయ పంట నష్ట పరిహారం ఇప్పటివరకు పట్టించుకోని అధికారులు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే కోడూరు నాయకులు అనంత రాయల్ మాట్లాడుతూ చెరువు కట్ట తెగి 6 నెలలు అయినా ఇంతవరకు బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదని కనీసం వారిని ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు.
చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహులు మాట్లాడుతూ అమాంతంగా పెరిగిన విద్యుత్ చార్జీల దెబ్బ కి సామాన్యుడి జేబులో పైసా మిగలని పరిస్థితి ఏర్పడిందన్నారు.కోడూరు నాయకులు పగడాల చంద్ర మాట్లాడుతూ గ్రామాలలోకి సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో కొనసాగుతోందన్నారు.
ఆలం రమేష్ మాట్లాడుతూ మండలం పొడవునా చేయేరు ఇసుక వున్ననూ అధికారపక్ష ఇసుక మాఫియా వల్ల సొంత గ్రామస్తులకి కూడా ఇసుక అందుబాటులో లేకుండా చేశారని అన్నారు.
రైల్వేకోడూరు నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడుతూ రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేస్తాం అని చెప్పి మాట తప్పిన వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే పెనగలూరు జనసేన మండల నాయకులు పూజారి మనీ మాట్లాడుతూ సామాన్యుడిని నిత్యం భయపడుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.పెనగలూరు నాయకులు గొబ్బూరు హరి మాట్లాడుతూ జీవన ఉపాధి లేక వున్న ఊరిని వదిలి గల్ఫ్ దేశాలకి వలసలు పోతున్న యువకులు.. ఇక్కడే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెనగలూరు జనసేన పార్టీ తరఫున ఎమ్మార్వో ఈ సమస్యలు పరిష్కరించకపోతే రిలే ధర్నా చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వెంకట్ రమణ, ఎర్ర జొన్నగారి శ్రీనివాసులు, కొనిశెట్టి ప్రసాద్ రాయల్, కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ, ఏనుగుల శివ, మోడం శీను, నెల్లూరు రవి, మారం రెడ్డి పవన్, కోనేటి శివయ్య, పెనగలూరు జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Comments