రుయా ఆస్పత్రి అంబులెన్స్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు - తప్పు జరిగితే కానీ దిద్దుబాటు ఉండదా అంటూ ప్రశ్న - ప్రజా సంక్షేమం అంటే ఇదేనా అంటూ ఎద్దేవా.
రైల్వేకోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండలం,కొండూరు గ్రామం లోని ఎస్టీ కాలనీలో నివాసముంటున్న కంభం పాటి నరసింహులు కుమారుడు జాషువా (పది సంవత్సరాలు) ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూ తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణించగా.. కుటుంబ సభ్యులను ఈరోజు రైల్వేకోడూరు పరిధిలోని జనసేన పార్టీ నాయకులు పరామర్శించి బాధితులకు చిరు సహాయం అందజేశారు.
మరణించిన బాలుడి మృతదేహాన్ని తన స్వస్థలం కు తీసుకురావడానికి 20 వేల రూపాయలు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్లు డిమాండ్ చేయడం, తోటలో కాపలాదారుడిగా వృత్తి జీవనం సాగిస్తున్న నర్సింహులు తన ఓనరు ఆంబులెన్స్ పంపిస్తాను అని చెప్పగా, తిరుపతి రుయా ఆస్పత్రిలో సిండికేట్ మాఫియాగా ఉన్న అంబులెన్స్ వాళ్లు తీవ్ర పదజాలంతో బాధితుని తండ్రిని తిడుతూ మృతదేహాన్ని తమ అంబులెన్స్ లో తప్ప మిగతా వాటిలో తరలించడానికి వీలులేదని అతణ్ణి తీవ్ర మనోవేదనకు గురి చేశారని, చివరికి చేసేదేమీ లేక స్కూటర్ మీద బాలుడి మృతదేహాన్ని తరలించడం, అంతేకాక స్కూటర్ మీద తరలించేందుకు సమాయత్తం అయినా కుటుంబీకులపై కూడా పరుసజాలంతో దూషించారని ఇది యావత్ సమాజానికి తలదించుకునేలా సిగ్గుచేటు చర్య అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల కోసం పని చేస్తుందో ఈ సంఘటన తెలియజేస్తోందని, రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల దగ్గర దాదాపు ఇదే పరిస్థితి ఉన్నదని కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరుచుకుని "ఆంబులెన్స్ సిండికేట్ మాఫియా" మీద ఉక్కుపాదం మోపాలని జనసేన పార్టీ తరపున వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మర్రి రెడ్డిప్రసాద్, మాదాసు నరసింహ రాయలు ,పూజారి మనీ రాజేష్ ,జనసేన దళిత నాయకులు నగిరి పాటి మహేష్ , మరియు కొండేటి వెంకటరమణ , సువ్వారపు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Comments