ఎన్నాళ్ళు-ఎన్నేళ్ళు-ఈ కన్నీళ్ళు పోస్టర్ ఆవిష్కరణ
అన్నమయ్య ప్రాజెక్ట్ వరద భాధితులకు తోడుగా ఉమ్మడి కడప జిల్లా జనసేన నాయకులు,జనసైనికులు రూపోదించిన ఎన్నాళ్ళు-ఎన్నేళ్ళు-ఈ కన్నీళ్ళు పోస్టర్ ను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మంగళగిరి జనసేన పార్టీ అఫీసులో ఆవిష్కరించిన విషయం విధియమే.రాజంపేట జనసేన యువనాయకుడు అతికారి దినేష్ ఈ పోస్టర్ ను ప్రతి గ్రామంలోకి తీసుకపోయే విధంగా అలాగే YCP ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు వరద భాధితులను గాలికి వదిలేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని పోవలని రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులకు,జనసైనికులకు పిలుపు ఇవ్వడంతో నందలూరు జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఈ పోస్టర్ ను నూకినేని పల్లె పంచాయతీ బలిజపల్లెలో జనసైనికుల మధ్య విడుదల చేయ్యడం జరిగింది.ఈ సందర్భంగా కొట్టే శ్రీహరి మాట్లడుతూ అన్నమయ్య వరదలు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్న చలనం లేని ఈ YCP ప్రభుత్వంకు కళ్ళు తెరిపించే కార్యక్రమమే ఎన్నాళ్ళు-ఎన్నేళ్ళు-ఈ కన్నీళ్ళు అని తెలియజేశారు.అన్నమయ్య ప్రాజెక్టు భాధితులకు సంపూర్ణ పరిహారం అందిచేలా చెయ్యడమే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అన్నమయ్య డ్యామ్ బాధితులకు న్యాయం చెయ్యడం కోసం జనసేన నాయకులు జనసేన శ్రేణులు భాధితులతో,ప్రజలతో కలిసి ఒక్క రోజు రిలే నిరాహార దీక్ష చేసి ఈ నెల 30న రాయచోటి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో యెద్దల నరసింహా,సంబావు వెంకటేష్, గణపతి వెంకటేష్,లేబాక్ మహేష్,వినయ్, కొసన సుబ్రమణ్యం, సున్నం నరేంద్ర, చిన్నం రమేష్ ఒకాకుల శ్రీకాంత్, చిన్న వెంకట తేజ, గణపతి లోకనాథ్, నరేష్, వీళ్ళ బోయిన వెంకట కృష్ణయ్య, పల్లపోతుల సాయి తేజ, గణపతి త్యాగరాజ్,నరేంద్ర,పవన్,ఓదేటి శ్రీనివాసులు,సుబ్బయ్య,షరీప్,ఓదేటి నరసింహులు, రమణ, పూల హరి, గణపతి కార్తీక్, సంబావు రాజేష్, గంజి మనోహర్, సంబావ వెంకటయ్య జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments