top of page
Writer's pictureEDITOR

కాబోయే సి.ఎం పవన్ కళ్యాణ్ - జనసేన

కాబోయే సి.ఎం పవన్ కళ్యాణ్ - జనసేన

రాజంపేట, కాబోయే సీ.ఎం పవన్ కళ్యాణ్ అనిజనసేన నాయకులు పేర్కొన్నారు. రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఆదివారం జనసేన నాయకులు శవన వారి పల్లి, కొల్లవారి పల్లి పంచాయతీలలో 34 వ రోజు "పవన్ అన్న ప్రజా బాట" కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని ఈ గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణేనని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, నాయకులు మన్నూరు గోపి, శంకరయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, వీర మహిళ జెడ్డా శిరీష, బండి లక్ష్మిదేవి, మల్లేశ్వరి, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

14 views0 comments

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page