ఇప్పటం ప్రజలను వేధించడం సరికాదు : జనసేన
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట
గుంటూరు జిల్లాలోని ఇప్పటం ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నారన్న కారణంగా అధికార పార్టీ రోడ్ల విస్తరణ పేరుతో వారిని వేధించడం సరికాదని రాజంపేట జనసేన నాయకులు తెలియజేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్యులపై విరుచుకుపడుతోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక రాక్షస పాలనా అని ప్రశ్నించారు. పేదలకు అండగా ఉంటున్న జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్న ప్రజలపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటం ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇకనైనా కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, భువనగిరి పల్లె శంకరయ్య, వీరయ్య ఆచారి, బండ్ల రాజేష్, పోలిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments