శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబెడు మండలం కల్లి పూడి గ్రామంలో జనసేన మాయకులు ఈ రోజు పర్యటించి గ్రామ ప్రజాలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దుర్భరంగా ఉంది. ఊరి మొత్తానికి ఉన్న ఒక్క స్మశాన వాటికకు వెళ్ళేదారి లేకపోవడం వలన ఒక సన్నని వంతెనపై వెళ్లాల్సి వస్తుంది.ఈ వంతెనపై వెళుతూ ఇప్పటివరకు ఇద్దరు కాలువలో పడి మరణించారు.ఇంకా ఇక్కడ ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్ళు శిథిలావస్థకు చేరుకొని పెచ్చులు ఊడి పడుతున్నాయి.ముందు ఉన్న ప్రభుత్వ హయాంలో కజారియా పరిశ్రమకు రైతులు ఇచ్చిన భూములకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని,ఈ విషయాల్ని రైతులు అధికారుల దృష్టికి, స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకు వెళ్ళినా కూడా తమకు న్యాయం జరగలేదని జనసేన నాయకుల దగ్గర వాపోయారు. ఈ విషయాలన్నీ విన్న జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కల్లి పూడి గ్రామంలో సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో చిత్తూరుజిల్లా కార్యదర్శి కొట్టెసాయి, మాధవ మహేష్, చిరంజీవి, లోకేష్, బద్రి, వెంకటయ్య, నవీన్, మోహన్, అనిల్, వెంకయ్య, సుబ్రహ్మణ్యం మస్తానయ్యా, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comentarios