top of page
Writer's pictureDORA SWAMY

కోనసీమ అల్లర్లకు వైసిపియే కారణం. తాత శెట్టి నాగేంద్ర.

Updated: May 26, 2022

కోనసీమ అల్లర్లపైన, అనంతబాబు డ్రైవర్ హత్య పైన సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలి.


-- జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర



చిట్వేల్ లో జనసేన నాయకులు తాతం శెట్టి నాగేంద్ర మాట్లడుతూ వైసీపీ పార్టీ అధికారం లోకి వఛ్చిన తరువాత.. ఎప్పుడు జరగని విధ్వంసాలు జరుగుతున్నాయి.. ఒకటి దళిత డ్రైవర్ హత్య. రెండవది అమలాపురం విధ్వంసం.ఆ రెండిటి పై

రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వయిరీ పైమాకు నమ్మకం లేదని

తమ పార్టీ MLC అనంతబాబు దళిత యువకుడిని హత్య చేస్తే ఇప్పటి వరకు స్పదించని హోంమంత్రి అమలాపురం అల్లర్లు జరిగిన వెంటనే స్పందించి ఈ అల్లర్లలో జనసేన ప్రమేయం ఉందని అంటున్నారు.మీ నిఘా విభాగం ఏమైంది.మంత్రి ఇంటికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు.


కోనసీమ జిల్లా కు ఒక ఎస్పీ ఉండి కూడా ఎందుకు కాపాడలేకపోయారు. గతంలో ఒక డిఎస్పీ స్ధాయి అధికారి ఉన్నప్పుడే ఎంతో సమర్ధవంతంగా పనిచేసారు.

మీ స్వార్ధ రాజకీయాల కోసం అంబెద్కర్ పేరును వివాదం చేస్తున్నారు.

అమలాపురంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేయడం మానేసి .. ప్రతి పక్షపార్టీలపై ..బురదజల్లే పని లో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అని నాగేంద్ర అన్నారు.


పగడాల చంద్ర మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ముద్దాయి అనంతబాబు ని మీడియా సమావేశంలో గారు గారు అని సంబోదించడం. దారుణం.. ఇలాంటి అద్భుతం మైన సంఘటనలు వైసీపి ప్రభుత్వంలో సాధ్యం అన్నారు.


మాదాసు నరసింహ మాట్లాడుతూ

అమలాపురం సంఘటన పోలీసుల వైఫల్యమే.ఉదయం 500 మంది ఉన్న ఆందోళన కారులు 2 గంటలకు అంత మంది ఎలా వచ్చారు దాని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది.మంత్రి ఇంటి వద్ద వందమంది మాత్రమే ఉన్న ఆందోళన కారులను పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు.


ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది.

కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉంది. కోనసీమ పరిరక్షణ సమితిలో ఉన్న వారందరూ వైసిపి నాయకులే.అమలాపురం సంఘటనను జనసేన మీద రుద్దే ప్రయత్నం ప్రభుత్వం కుట్ర చేస్తుంది.జనసేననాయకులు గాని కార్యకర్తలు గాని అమలాపురం ఆందోళనలో పాల్గొనలేదు. మా నాయకుడు ఆదేశాలు మేరకు జనసైనికులు సంయమనం పాటించి అల్లర్లకు దూరంగా ఉన్నారన్నారు.


పగడాల వెంకటేష్ మాట్లాడుతూ ఇళ్ళ పైకి వెళ్ళి తగలబెట్టడం చాలా హేయమైన చర్య అని...పి.కె ప్లాన్ లో భాగంగానే ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టారని .రాజకీయాల కోసం అంబెద్కర్ పేరును రాజకీయం చేయడం దారుణం అన్నారు.


కంచర్ల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అనంత బాబు డ్రైవర్ హత్య సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అమలాపురం అల్లర్లను సృష్టించారు. డ్రైవర్ హత్యలో అనంతబాబు తో ఇంకెవరు ఉన్నారో బయట పెట్టాలని అమలాపురం అల్లర్లకు జనసేనకు సంబంధం ఉన్నట్లు హోం మంత్రి మాట్లడిన మాటలను వెనక్కి తీసుకోవాలి అన్నారు.


పగడాల శివ మాట్లాడుతూ కులాలు కలిపి సిద్ధాంతం జనసేన పార్టీ అని అల్లర్లు చేసే సంస్కృతి జనసేన పార్టీలో లేదని అన్నారు

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కడుమూరి సుబ్రమణ్యం, కొనిశెట్టి చక్రి, పగడాల శివరాం, కొనిశెట్టి ప్రసాద్, నీలి కృష్ణ, మాదినేని హరి, రోళ్ళ లోకేష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు

22 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page