సెప్టెంబర్ 8న జాబ్ మేళా
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా టిడిపి జాబ్ మేళా చేపడుతోందని, ఇందులో భాగంగా సిఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన స్థానిక ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల నందు దాదాపు 50 కంపెనీల వారిచే జాబ్ మేళా నిర్వహించి 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు, ప్రొద్దుటూరు టిడిపి నాయకులు సీఎం సురేష్ నాయుడు సోమవారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడచిన నాలుగు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందని, కంటి తుడుపు చర్యగా వాలంటరీ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఐదువేల జీతానికే పరిమితం చేసిందని, ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక నియోజకవర్గంలోని యువత చెడు మార్గాన్ని ఎంచుకుంటోన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువతను సన్మార్గంలో నడిపించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని, రాబోవు రోజుల్లో మరో రెండు దపాలు జాబ్ మేళాలు నిర్వహించి, దాదాపు 1500 నుండి 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. కావున నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి వి ఎస్ ముక్తియార్, కడప జిల్లా తెలుగు యువత నల్లబోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments