కువైట్ తెలుగు వారి ముద్దుబిడ్డ జిలకర మురళి రాయల్.
---ఆపదలో ముందుండి ఆదుకునే గుణం--అరబ్ దేశంలో తెలుగు కీర్తిని చాటుతున్న నైజం అతని సొంతం.
పుత్రుడు పుట్టగానే తండ్రికి పుత్రోత్సాహం కలగదు. అతడు పొందిన సంస్కారము, పలువురు మెచ్చుకునే తీరు తో ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగుతుందన్న వెనకటి సుమతి పద్యాన్ని నిజం చేస్తున్నాడు ఓ వ్యక్తి. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు గ్రామానికి చెందిన జిలకర పెద్ద సుబ్బయ్య,రామ సుబ్బమ్మ ల కుమారుడు మురళి రాయల్.
తమ తరాలకు తరగని ఆస్తి అందించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న సమాజంలో తనకు ఎలాంటి సంబంధం లేని వారికి ఆపదలో అన్నా అని పిలుస్తానే ఓ పెద్ద కొడుకులా, ఓ సోదరుడుగా అన్నీ తానై సహాయపడుతూ కువైట్ దేశంలో తెలుగు వారే కాదు, యావత్ భారతీయులందరి మనసులో సుస్థిర స్థానాన్ని పొందిన వ్యక్తి జిలకర మురళి రాయల్. సామాజిక, సేవ, రాజకీయ వ్యక్తులతోపాటు ముఖ్యమంత్రులు నుంచి ప్రశంసలు, అవార్డులు పొందిన ఘనత అతనిది.
సేవా ప్రస్థానం:----మొదటిసారిగా 2003 సంవత్సరంలో తన సమీప బంధువైన ఓ వ్యక్తి మరణించడంతో కువైట్ దేశం నుంచి స్వస్థలానికి పంపించే క్రమంలో అటు ఎంబసీ ద్వారా ఎదుర్కొన్న పలు రకాల ఇబ్బందులను మరే ఒక్కరు ఎదుర్కోకూడదన్న సంకల్పంతో నడుంబిగించి "2014లో శ్రీకృష్ణదేవరాయ ఎన్నారై సేవా సమితి" సంఘాన్ని ఏర్పాటు చేసి కాపు సంఘం ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ గుండెపోటు, యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు పలు రకాల ఇబ్బందులతో చనిపోతున్న మన తెలుగువారి మృతదేహాలను సుమారు రెండువేల మందిని వారి స్వస్థలాలకు చేర్చిన ఘనత జిలకర మురళి రాయల్ ది. అంతేకాదు ఆరోగ్య స్థితి బాగు లేని వారిని తీవ్ర అనారోగ్యం ఉన్న వారిని తానే అన్నీ తోడై వేలాది మందిని ఇంటికి చేర్చడం అతని గొప్పదనం. కరోనా సమయంలో తాను అందించిన సేవలు అమోఘం.
నా జీవితం ప్రజాసేవకు అంకితం:---సామాన్య రైతు కుటుంబంలో జన్మించి,పలు కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న నేను.. రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజలకు మరింత సేవ చేయాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఆదర్శాలు నచ్చి జనసేన పార్టీ సేవకునిగా మారానని తన మనోగతం వ్యక్తం చేశారు జిలకర మురళి రాయల్. కువైట్ లో లక్షలాదిమంది అభిమానాన్ని చూరగొని "తెలుగు వారి ముద్దుబిడ్డగా" పిలవబడుతున్న తనకు సముచిత స్థానం కల్పిస్తే పార్టీ గెలుపుకు, అభివృద్ధికి శాయాశక్తుల కృషి చేస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తెలుగువారి పండుగలు అయిన సంక్రాంతి, వనభోజనం తదితర కార్యక్రమాలను కువైట్ దేశంలో నిర్వహిస్తూ తెలుగువారిని ఏకతాటిపై నడిపిస్తూ తెలుగు ఖ్యాతిని చాటుతున్న తెలుగు బిడ్డ జిలకర మురళి రాయల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, మరిన్ని సేవలు అందించాలని మనమంతా ఆశిద్దాం.
Comments