పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: జిల్లా పరిషత్ చైర్మన్
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఏప్రిల్ మాసంలో జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పెద్ద కారంపల్లి గ్రామపంచాయతీలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రవాసాంధ్రలు కేకే రెడ్డి సహకారంతో పరీక్షా సామాగ్రిని ఆయన తల్లి మన్నూరు రామలక్ష్మమ్మ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పేద పిల్లల విద్యాభివృద్ధికి కేకే రెడ్డి చేస్తున్న సహాయం అభినందనీయమన్నారు. పేద ప్రజల సంక్షేమానికి తన వంతు సహాయంగా నిరంతర సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు చొప్ప ఎల్లారెడ్డి, పెంచలయ్య, మన్నూరు నారాయణరెడ్డి, ఎంజీపురం ఎంపీటీసీ మధుబాబు, బాబు, శివరామిరెడ్డి, శుభో ద్ రెడ్డి, మిరియాల సురేఖ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comentários