ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర వార్త,
స్టీల్ ప్లాంట్ ఏ ఐ టి యు సి నుంచి చీకటి గురునాథ్, ఎల్ సత్యనారాయణ, బి వెంకట రాజు తదితరులు తమ స్నేహితులతో నేడు సి ఐ టి యు చేరారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ప్లాంట్ లోని వివిధ విభాగాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు జె అయోధ్య రామ్ మాట్లాడుతూ పోరాటాల పట్ల అంకితభావం లేని పోరాటాల పై కార్మికుల విశ్వాసం సన్నగిల్లుతుంది అని ఆయన అన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే నేడు ఏ ఐ టి యు సి నుంచి సిఐటియు లోకి అనేక మంది కార్మికులు చేరుతున్నారని ఆయన వివరించారు. 1988 డిసెంబర్ బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సమయంలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా వ్యవహరించిందని ఆయన అన్నారు. వారికి రావలసిన కంప్యూటర్ ఇంక్రిమెంట్ వీరి ఒప్పందం వల్ల కోల్పోయారని ఆయన వివరించారు. తరువాత గుర్తింపు సంఘంగా సి ఐ టి యు వచ్చి భావితరాలకు కూడా ఈ ఇంక్రిమెంట్ కొనసాగే విధంగా ఒప్పందం చేసిందని ఆయన అన్నారు. నేడు మన వేతన పట్టికలో SABF మన వాటాగా 2% అధిక మొత్తం, యాజమాన్య వాటాగా తక్కువ మొత్తం అందజేస్తారని ఇది వాస్తవం కాదా అని అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రధానంగా నేడు పదవీ విరమణ పొందుతున్న కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని 1995 లో సి ఐ టి యు చేసిన ఒప్పందం మని ఆయన అన్నారు. కార్మిక వర్గానికి నాయకత్వం వహించే వారికి దూరదృష్టి లోపిస్తేనే ఇటువంటి ఒప్పందాలు జరుగుతాయని ఆయన అన్నారు. దూర దృష్టితో ఆలోచించే సిఐటియు మిత్రపక్షాలను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వై టి దాస్, ఆ విభాగాల కార్యదర్శులు రమణ మూర్తి, కె శ్రీ రామచంద్ర రావు, మారుద్ర రావు, ఎస్ సత్యనారాయణ, రామకృష్ణ, జగ్గారావు, ఆర్ గణేష్ కుమార్, చినారె తదితరులతోపాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Comments