గురుకుల పాఠశాల ను ఆకస్మిక తనిఖీలు చేసిన న్యాయమూర్తి
సమస్యల తో స్వాగతం పలికిన విద్యార్థులు.
కనీస వసతులు లేని గురుకులం
సమాధానం దాటవేత ధోరణి లో ఉపాద్యాయులు
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ న్యాయమూర్తి కే.లాత "డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం మరియు కళాశాల ఆడపూరు" ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలు హాస్టల్ నందు విద్యార్థులకు గల సదుపాయాల గురించి తెలుసుకున్నారు, వంటశాల భోజనశాలను తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను, సెక్యూరిటీ మెజర్స్ ని పరిశీలించారు. సీ.సీ కెమెరా లని పరిశీలంచారు.
ఇందులో విద్యార్థులకు మంచాలు లేకుండా నేల మీద పడుకుంటున్నారని, కనీస వసతులు కూడా లేకుండా పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె దృష్టికి వచ్చింది. సరిగా నీళ్లు రావడంలేదని, శానిటరీ పాడ్స్ శుభ్రం చేయడం లేదని, ఎక్కడ చెత్త అక్కడే ఉండడం వలన దోమలు ఎక్కువ అవుతున్నాయని తెలిసింది. విద్యార్థులందరికీ జ్వరాలు వస్తున్నాయని తరగతులకు హాజరు కాలేదని తెలిపారు.
కాంట్రాక్టర్ ప్రొవిజన్స్ అందజేయడం లేదని, ఒకవేళ అడిగితే వారికి డబ్బులు రావడం లేదని చెబుతున్నారని తెలిసింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ విధులకు సరిగా హాజరు కావడం లేదని అందువలన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసింది. నవంబర్ 14 న చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులతో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలని, ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల జీతాన్ని కాలు రాస్తాయని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకోవాలని , విద్యార్థి దశ అత్యంత కీలకమైనదని తెలిపారు. యువత ఆకర్షణకు లోను కాకుండా సన్మార్గంలో నడవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలంటే తల్లిదండ్రులు, గురువులు చెప్పినవి వినాలని వారు చెప్పినవి క్రమశిక్షణ అలవర్చుకోవాలని తెలి తెలిపారు. సెల్ఫోన్ వాడ రాదని, వాట్సాప్ చాటింగ్ ఆన్లైన్ చాటింగ్ చేస్తే నేరాలు ఇచ్చిన వారు అవుతారని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి సేఫ్ ఎన్విరాన్మెంట్ లో సేఫ్ హాండ్స్ లో ఉంటూ బాగా చదువుకొని అనుకున్నవన్నీ సాధించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి వినయ విధేయత కండక్ట్ మరియు క్యారెక్టర్ కలిగి ఉండాలని ఇవన్నీ బాధ్యతమైన పౌరులుగా తీర్చిదిద్దుతారని తెలిపారు. ఇందులో నందలూరు ఎస్సై అబ్దుల్ జహీర్, కానిస్టేబుల్స్ కోర్టు స్టాఫ్ , పి ఎల్ వి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Komentáre