పేద క్రీడాకారిణులకు ఆర్ధిక సాయం
క్రీడాకారులను పోత్సహించిన రాచమల్లు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి క్రీడలపై తనకున్న ఆసక్తి గౌరవాన్ని చాటారు, మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు నివాసం నందు జంపింగ్ జంప్ రోప్ క్రీడాకారిణులు ప్రొత్సాహకాలు అందించి ఆయన దాతృత్వాన్ని మరోమారు నిరూపించుకున్నారు. వివరాల్లోకి వెళితే నవంబర్ పద్దెనిమిది నుండి ఇరవై అయిదవ తేదీ వరకు బ్యాంకాక్ నందు జరిగే క్వీన్స్ కప్ పోటీలకు, ప్రొద్దుటూరు ఐడియల్ శసికా నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న షేక్ సుమయ, తొమ్మిదవ తరగతి చదివే షేక్ అఫియా క్వీన్స్ కప్ పోటీలకు అర్హత సాధించగా, పేదరికం కారణంగా విదేశాలకు వెళ్లి పోటీలలో పాల్గొనలేని పరిస్థితిని కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి ద్వారా తెలుసుకొని వారికి చెరో యాబై వేలు ఆర్ధిక సాయం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ క్రీడాకారిణులు ఇద్దరు తన నియోజకవర్గం వారు కావటం తనకు గౌరవంగా ఉందని, అటు కుటుంబ గౌరవాన్ని ఇటు దేశ గౌరవాన్ని పెంచుతారని ఆశాభావం వ్వ్యక్తం చేశారు. పేదరికం నుండి దేశానికి పేరు తెచ్చే ఆణిముత్యాలు పుడతారనటానికి ఇది నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. క్రీడలకు ఆర్ధిక సంబంధాలు ఉండటం, ప్రతిభ గల క్రీడాకారులకు పేదరికం అడ్డుగోడలా శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం నుండి ఇటు కుటుంబం నుండి ఆర్ధిక సహాయం లేకపోవటం వలన ప్రతిభ గల క్రీడాకారుల నైపుణ్యం మరుగున పడిపోతుందని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో క్రీడాకారులకు ప్రొత్సాహకాలు కొరవడ్డాయన్నారు. క్రీడలలో రాణించే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు, పిల్లలు చదువుతో పాటు క్రీడలపై కూడా ద్రుష్టిసారించాలని అభిప్రాయపడ్డారు.
Comments