ఖాళీ బాండ్ల పైన సంతకాలు పెట్టరాదు - జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
కాళీ పత్రాలు, బాండ్ల పైన సంతకాలు పెట్టరాదని జూనియర్ సివిల్ జడ్జి ఎం.సంధ్యారాణి సూచించారు. శనివారం మండల పరిధిలోని పోలి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రో నోట్ కాలపరిమితి మూడు సంవత్సరాలని, వ్యవధిలోపు కొంత మొత్తాన్ని జమ చేస్తూ ప్రొనోటులో రాయడం వలన మరలా మూడు సంవత్సరాలు కాలవ్యవధి పెరుగుతుందని తెలియజేశారు. లక్ష రూపాయలు లోపు సంవత్సర ఆదాయం కలిగిన వారు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే న్యాయస్థానమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ బాల్య వివాహాలు నేరమని, చట్టరీత్యా ఆ వివాహాలు చెల్లుబాటు కావని తెలిపారు. ఎవరైనా వివాహం రద్దు చేసుకోదలుచుకుంటే కొట్టు ద్వారానే చేసుకోవాలని, కాగితాల పైన ఒప్పంద పత్రాలు చెల్లవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి శ్రీధర్, సచివాలయ సిబ్బంది, కోర్టు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments