top of page
Writer's pictureEDITOR

మానసిక రుగ్మత సాధారణ జబ్బు - జూనియర్ న్యాయ మూర్తి కే. లత

మానసిక రుగ్మత సాధారణ జబ్బు - జూనియర్ న్యాయ మూర్తి కే. లత

అక్టోబర్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నందలూరు కోర్టు నందు న్యాయవిజ్ఞాన సదస్సును చైర్మన్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ, నందలూరు. శ్రీమతి కే.లత గారు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ మానసికంగా బాధపడడం కూడా ఒక జబ్బు లాంటిదే అని కౌన్సిలింగ్ ద్వారా మెడిసిన్స్ ద్వారా లైఫ్ స్టైల్ లో మార్పుల వలన ఈ మానసిక రుగ్మతలకును పోగొట్టుకోవచ్చనిఅని తెలియజేశారు. మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడే వారిని చులకనగా చూడడం మహాపాపం అన్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్న బాధితులను గొలుసులతో నిర్బంధించడం కొట్టడం మాటలతో దూషించడం తీవ్ర నేరం అని పరిగణిస్తారని తెలియజేశారు మతిస్థిమితం కోల్పోయిన బాధితులకు 2017 మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ ప్రకారం ప్రత్యేక వైద్య సౌకర్యాలు పొందవచ్చునన్నారుమానసిక రుగ్మతలతో ఇబ్బంది పడే వారిని చులకనగా చూడడం మహాపాపం అన్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్న బాధితులను గొలుసులతో నిర్బంధించడం కొట్టడం మాటలతో దూషించడం తీవ్ర నేరం అని పరిగణిస్తారని తెలియజేశారు మతిస్థిమితం కోల్పోయిన బాధితులకు 2017 మెంటల్ హెల్త్ కేర్ ఆక్ట్ ప్రకారం ప్రత్యేక వైద్య సౌకర్యాలు పొందవచ్చునన్నారు. మానసికంగా బాధపడే వారి కోసం మెంటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయని తెలిపారు. మెంటల్ అంటే పిచ్చి వారు మాత్రమే కాదు ఇప్పుడు ఎక్కువగా పెరిగిపోతున్న డిప్రెషన్ యాంగ్సైటి,డిప్రెషన్, అడిక్షన్ కూడా మెంటల్ ఇన్నెస్ కిందికి వస్తాయని తెలిపారు. సెల్ ఫోన్, అడిక్షన్ డ్రగ్ అడిక్షన్, స్మొకింగ్ , కూడా మెంటల్ ఇన్నెస్ కిందికి వస్తాయని తెలిపారు. ఏదైనా సమస్య మెదడుపై ప్రభావం చూపిస్తే దానిని మెంటల్ ఇన్నెస్ అంటారని తెలిపారు ఆల్కహాల్ తీసుకోవడం వలన కలిగే నష్టాల గురించి తెలియజేశారు. ఏ సమస్యనైనా ధైర్యంగా అధిగమించడం నేర్చుకోవాలని రోబాలకు లోను కాకుండా ఉండాలి అన్నారు.


ఈ కార్యక్రమం డాక్టర్ విజయభాస్కర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కుటుంబంలో ఎవరైనా మానసిక రుగ్మతలకు లోన్ అవుతున్నారని తెలుసుకోవడం అందుకు పరిష్కారం తెలుసుకోవడం చాలా ముఖ్యం అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డి. నరసింహులు, అనుదీప్ జై సింహ, ఆనంద్ కుమార్ గారు, సెమీ ఉల్లా ఖాన్ గారు, సుబ్బరామయ్య గారు, రాబిన్ గారు, పోలీసులు, పి ఎల్ వీలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


4 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page