అగనంపూడి ప్రసన్న ఆంధ్ర వార్త, ఉక్కు కార్మికులు నిర్వాసితులు సంక్షేమం, కర్మాగారా పరిరక్షణే ఏఐటీయూసీ ధ్యేయము ఏ ఐ టి యు సి యూనియన్ అధ్యక్షులు కే సత్యనారాయణ రావు(కే ఎస్ న్)
అగనంపూడి -వి ఎస్ జి హెచ్ రోడ్డులో వేపచెట్టు దగ్గర ఏ టిఐటియుసి - టిఎన్ టి యు సి మిత్రపక్షాలు నాయుకులు 79, 85 వార్డు నివాస ఉక్కు కార్మికులను సీరియల్ నెంబర్ 9 గులాబీ పువ్వు గుర్తు పై ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది.
కే సత్యనారాయణరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఏ ఐ టి సి యు మేనఫెస్టో లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు, కొవిడ్ లో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తులను ఎంతో ఆశాజనకంగా తీసుకొస్తున్న ఉక్కు యాజమాన్యము ఒక పథకం ప్రకారం కొన్ని డిపార్ట్మెంట్లో నిరాశ పరుస్తున్నారు, సీఎస్ఆర్ నిధులు నిర్వాసితుల కోలనిల్లో వినియోగించడం లేదని. ఉక్కు నిర్వాసితుల ఉద్యోగులు ఎంతోమంది పదవీ విరమణ, అనారోగ్యము, ప్రమాదం మరణిస్తున్న వాటి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయకపోవడం శోచనీయమని అన్నారు ఉక్కు ప్రగతికి మలుపు తిప్పే ఈ ఎన్నికల్లో ఏ ఐ టి యు సి ని గెలిపించాలని కోరారు.
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం బీ ఐ ఎఫ్ ఆర్ కి వెళ్ళకుండా, ఉక్కు హార్టికల్చర్ సొసైటీలో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని దే అని ఉక్కు నిర్వాసితుల జీవనాధారమైన ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో టి ఎన్ టి యు సి -ఎఐటియుసి యూనియనే గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఏఐటీయుసీ నాయకులు యల్లపు సాంబశివరావు సభాధ్యక్షత జరిగిన సమావేశంలో టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ , ఏ ఐ టి యు సి నాయకులు బొబ్బరి సూర్య, అలమండ శ్రీనివాసరావు, గంతకోరు అప్పారావు, గంట్ల రామారావు, రెడ్డి, శ్రీనివాస రావు, టి ఎన్ టి యు సి నాయకులు శిరంశెట్టి బాబ్జి ,టిడిపి నాయకులు సింగిడి సింహాచలం ,పల్లెల నాగేశ్వరరావు మరియు మిత్రపక్షం నాయకులు పాల్గొన్నారు.
Comentarios