కడప విమానాశ్రయం నుండి గత ఐదు నెలలుగా పలు రకాల కారణాల చేత నిలిచిన విమానాయన సర్వీసులను ఆదివారం నుంచి పునః ప్రారంభించారు. విమాన సర్వీసుల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ డెలప్మెంట్ అథార్టీకి సంబంధించి వయబులిటీ ఫండ్ చెల్లించడంతో పాటు విమాన రాకపోకలకు చర్యలు చేపట్టింది. దీంతో ఇండిగో విమాన సంస్థ ఆధ్వర్యంలో విమాన సర్వీసులు పున ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం కడప నగరం నుంచి అనేక నగరాలకు విమాన సర్వీసులు పునః ప్రారంభంతో పాటు పలు ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరిగింది.
ఇండిగో విమానం ఆదివారం ఉదయం 9.06 గంటలకు కడప విమానాశ్రయంకు చేరుకుంది. ఆ తరువాత అదే విమానం కడప నుండి 9.51 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళ్ళింది. విమాన ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ పి శివప్రసాద్ బోర్డింగ్ పాసులు అందచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ పి శివప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి విమాన సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండిగో విమాన సంస్థ, ఎయిర్ పోర్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం కడప నుండి చెన్నై, హైదరాబద్, విజయవాడ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. చెన్నై నుండి కడపకు చేరుకున్న విమానం విజయవాడకు వెళ్లింది. తిరిగి విజయవాడ నుండి కడప కు వచ్చి చెన్నైకు వెళ్లింది. అలాగే హైదరాబాద్ నుండి కడపకు వచ్చిన విమానం, తిరిగి హైదరాబాద్ కు బయలు దేరి వెళ్లింది. మూడు విమానాలకు సంబంధించి డిపార్ట్చర్ 100 మంది, ఇన్ కమింగ్ 57 మంది ప్రయాణీకులు వచ్చారు.
ఈ రోజు చెన్నైకు బయలు దేరిన 51 మంది ప్రయాణీకుల్లో 15 మంది ప్రయాణీకులు చెన్నైకు వెళ్లి అక్కడి నుంచి కువైట్ కు బయలు దేరి వెళ్లారని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ పి శివప్రసాద్ తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేదీ నుండి విశాఖపట్నం, బెంగుళూరు నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు. కడప నుంచి వయా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల నుండి దేశంలోని కొచ్చిన్ , గోవా, తిరువనంతపురం, మధురై, భుననేశ్వర్, కొయంబత్తూరు, వడోదర, ముంబాయి, చంఢీఘర్, కొల్ కత్త, వారణాశి, జైపూర్, సూరత్ అహ్మదాబాద్, ఢిల్లీ, తిరుచిరాపల్లి, మైసూరు, హుబ్లీ, లక్నో తదితర 25 నగరాల వెళ్లేందుకు కనెక్టివిటీ సౌకర్యం లభించిందన్నారు. దీంతో ప్రయాణీకులుఎక్కడికి వెళ్లాలన్నా సులభంగా వెళ్ల వచ్చన్నారు. కడప విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందు తోందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో విజయవాడ, హైదరాబాద్, చెన్నై నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు వుండేవని, ఈసారి కొత్తగా విశాఖపట్నం, బెంగుళూరు నగరాలకు విస్తరించామన్నారు. కడప విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందు తోందన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments