కడప జిల్లా సంచార జాతుల అవగాహన సభ జయప్రదం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం ఉదయం స్థానిక ఎన్.జి.ఓ కల్యాణ మంటపం నందు కడప జిల్లా సంచార జాతుల అవగాహన సభ ఏర్పాటు చేశారు, కడప జిల్లా ఎం.బి.సి కార్పొరేషన్ డైరెక్టర్ కత్తి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి, పలువు సంచార కులాల, తెగలకు చెందిన నాయకులు, ప్రజలు పాల్గొనగా, ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల సంఘం వ్యవస్థాప అధ్యక్షుడు పి. వీరన్న, ప్రొద్దుటూరు మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీపీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ వెనుకబడిన జాతులు, కులాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించటంలో ఎంతగానో కృషి చేస్తోందని, ఎం.బి.సి కార్పొరేషన్ ద్వారా సంచార జాతులు కులాలను ఏకం చేస్తూ, ఐకమత్యంగా కలిసి సమస్యలపై చేర్చించటానికి వేదికను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా చైర్మన్, డైరెక్టర్ల భర్తీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండే జరగటం గర్వించదగ్గ విషయం అని తెలిపారు. ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ వీరన్న మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమ సంచార జాతులను విస్మరించాయని, నేడు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు గుర్తించి సముచిత స్థానం కల్పించటంతో పాటు, పలు కులాలకు రిజెర్వేషన్ కల్పించటం కొరకు తన వొంతు కృషి చేస్తున్నారని కొనియాడారు. తమ జాతులను అనగారినవర్గాలుగా సమాజంలో చిన్నచూపు చూసిన అగ్రకులాలకు ధీటుగా నేడు తాము కూడా ప్రభుత్వం అన్హదిస్తున్న అమ్మఒడి పధకం ద్వారా తమ పిల్లలను చదివించుకుటూ, ప్రభుత్వం కల్పించిన పలు సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందుతూ, తమ జాతి వృత్తులను గౌరవిస్తూ వాటిని విడనాడక సమాజంలో గౌరవ స్థానం సంపాదించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 7వ తేదీన చేపట్టనున్న జయహో బీసీ మహాసభను జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలువురు నాయకులు ఎం.బి.సి కార్పొరేషన్ పి. వీరన్నను శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాన్ని అందచేశారు.
Comments